పశ్చిమగోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం


ప.గో.: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లారుజామున తాడేపల్లిగూడెం మండలం, పెదతాడేపల్లి స్పిన్నింగ్ మిల్లు వద్ద లారీని తప్పించబోయి రెండు బైక్‌లు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో పడాలకు చెందిన సంజీవయ్య(25) అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *