పాదరక్షలు పంచుతారా? సిగ్గు సిగ్గు: ప్రియాంక


అమేథి: రాహుల్ గాంధీ నియోజకవర్గమైన అమేథీలో ప్రియాంక గాంధీ వాడివేడి ప్రచారం సాగిస్తున్నారు. పది మంది గుమిగూడినా అక్కడ వారితో సమావేశమై ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. సోమవారంనాడు అమేథీ పర్యటనలో భాగంగా ఆమె కేంద్ర మంత్రి, బీజేపీ అమేథీ అభ్యర్థి స్మృతి ఇరానీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘స్మృతి ఇరానీ ఇక్కడుకు వచ్చిన షూలు పంచారు. ఇది మిమ్మల్ని అమానించడమే’ అని ఆమె అన్నారు. అమేథీ, రాయబరేలి ప్రజలు ఎప్పుడూ ఎవర్నీ అడుక్కోలేదని, మిమ్మల్ని అవమానపరిచిన వారికి, మీరు తీసుకున్నవి (పాదరక్షలు) తిరిగిచ్చేయండని కోరారు. స్మృతి ఇరానీ ఓట్ల కోసం ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని, తప్పుడు హామీలు ఇస్తున్నారని అన్నారు. అమేథి, రాయబరేలి ప్రజలకు గాంధీ కుటుంబం పట్ల అవ్యాజమైన ప్రేమ ఉందని, వారి ఆదరణ, అభిమానం ఎప్పటికీ మరచిపోలేమని చెప్పారు.
 
వారణాసి గ్రామాలకు మోదీ ఎప్పుడైనా వెళ్లారా?
‘ఎన్నో తరాలను మీరు చూశారు. రాజీవ్ గాంధీ గ్రామగ్రామానికి వెళ్లారు. రాహుల్ గాంధీ ప్రతి గ్రామం చుట్టారు. వారణాసిని చూడండి. ప్రధాని నరేంద్ర మోదీ ఆ నియోజకవర్గంలోని ఒక్క గ్రామానికి కూడా వెళ్లిన పాపాన పోలేదు’ అని ప్రియాంక తప్పుపట్టారు. మోదీపై మరిన్ని విమర్శలు గుప్పిస్తూ ‘మీరు ఎక్కడి వెళ్లినా అబద్ధాలు చెబుతుంటారు. అయితే అమేథీ ప్రజలు మాత్రం ఫూల్స్ కాదు. అమేథి ప్రజలను ఫూల్స్ చేయలేదు. 50 లక్షల ఉద్యోగాలను మీరు తుడిచిపెట్టేశారు. ఇప్పుడు అదే వ్యక్తులు చాలా ఉద్యోగాలిస్తామని చెబుతున్నారు. రైతులు ఆవేదనతో తల్లడిల్లిపోతున్నారు. భదోహికి వెళ్తే అక్కడ వ్యాపారులు జీఎస్‌టీ దెబ్బతో విలవిల్లాడిపోతున్నారు. వాళ్లు (బీజేపీ) చేస్తున్న ప్రచారం వాస్తవ విరుద్ధం. ఎక్కడకు వెళ్లినా జనం ఆవేదనలే నాకు కనిపిస్తున్నాయి’ అని ప్రియాంక తెలిపారు.
 
ప్రజలు బీజేపీని నమ్మి అధికారంలోకి తెచ్చారని, అయితే ఇప్పుడు తాను ఏ గ్రామానికి వెళ్లి చూసిన ప్రజల ఈతిబాధలే కనిపిస్తున్నాయని  ఆమె అన్నారు. వాస్తవం ఇలా ఉంటే తామెంతో ప్రగతి చేసి చూపించామంటూ వాళ్లు ప్రచారం చేసుకుంటున్నారని, వాస్తవం మాత్రం ఇందుకు భిన్నంగా ఉందని మోదీ సర్కార్ ఐదేళ్ల పాలనపై ప్రియాంక విరుచుకుపడ్డారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *