పాపం పండేనా..?


  • మామిడిని మాగబెట్టేందుకు ఎథిలీన్‌ బ్యాగ్‌ల వినియోగం
  • గతంలో కార్బైడ్‌ గ్యాస్‌ రాళ్లు వాడేవారు..
  • విచ్చలవిడి వినియోగంతో ప్రజల ఆరోగ్యం హరీ
  • రాజధాని జిల్లాల్లో యథేచ్ఛగా నిషేధిత రసాయన పద్ధతులు
  • ప్రజల ఆరోగ్యంపై ప్రభావం
పండ్లను కోసి.. కొబ్బరి పీచుతో మాగ బెట్ట డం సహజ పద్ధతి. ఇందుకు విరుద్ధంగా కొం దరు వ్యాపారులు నిషేధిత రసాయన పద్ధతులను అవలంభిస్తున్నారు. గతంలో కార్బైడ్‌ గ్యాస్‌తో మామిడి పండ్లను మాగబెట్టిన వ్యాపారులు.. ఇప్పుడు ఎథీలిన్‌ గ్యాస్‌ చాంబర్లకు బదులు పండ్లపై ఎథీలిన్‌ రసాయనాలు చల్లి పండి స్తున్నారు. ఇలా పండించిన వాటిలో చూడడానికి పండు పసుపు పచ్చగా నిగ నిగలాడుతూ కనపడినా.. సహజ వాస న, రుచి ఉండవు. రసాయనాల వల్ల ప్రజా రోగ్యం దెబ్బ తిన్నా మాకేం నష్టం లేదు.. మా లాభం మాకుంటే చాలు అనేరీతిలో వ్యవహరిస్తున్నారు. పండ్ల వ్యాపారు లపై నిఘా ఉంచాల్సిన వ్యవసాయ మా ర్కెటింగ్‌, ప్రజారోగ్య, విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినవస్తున్నాయి.
విజయవాడ/గుంటూరు(మెడికల్‌)/ తెనాలి అర్బన్‌: గుంటూరు, విజయవాడ నగరాల్లో పండ్ల మార్కెట్‌ వ్యాపారులు రసాయనాలు విచ్చలవిడిగా వినియోగి స్తూ మధుర ఫలాలను విషతుల్యాలుగా మారుస్తున్నారు. మామిడి, ద్రాక్ష, అరటి వంటి పండ్లను రసా యనాలతో మగ్గబెట్టవద్దని అధికారులు ఎంత మొత్తుకుంటున్నా.. క్షేత్రస్ధాయిలో దీనిని నివారించలేకపోతున్నారు. ముఖ్యంగా కార్బైడ్‌ గ్యాస్‌ వంటి ప్రమాదకర రసాయనాలు వాడవద్దని హైకోర్టు తీర్పు ఉన్నా ఆచరణలో అమలు చేయడం లేదు. ప్రస్తుతం మామిడి పండ్ల సీజన్‌ వచ్చింది.. గతంలో సహజ పద్ధతుల్లో గదిలో పండ్లను పోసి కుండలో కొబ్బరిపీచుతో పొగ బెట్టి మాగ బెట్టేవారు. ఈ ప్రక్రియకు 7 నుంచి 10 రోజుల సమయం పట్టేది. అయితే మార్కెట్‌లో మామిడి పండ్లకు ఉండే డిమాండ్‌ను వెంటనే క్యాష్‌ చేసుకునేందుకు వ్యాపారులు నిషేధిత రసాయన పద్ధతులను అవలభించడం మొదలు పెట్టారు.
 

ఇప్పుడేం చేస్తున్నారంటే..
గతంలో నిషేధిత కార్బైడ్‌ గ్యాస్‌ రాళ్లను వాడేవారు. మున్సిపల్‌ హెల్త్‌ అధికారులు తనిఖీలు చేసి వాటిని సీజ్‌ చేయడంతో వ్యాపారులు మరో రకంగా వీటిని మాగబెడుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రసాయనాలు వాడకుండా మాగ బెట్టే పద్ధతులతో పాటు ఎథిలీన్‌ వాయువుతో నిండిన చాంబర్లలో ఉంచి పండ్లను పండించు కోవచ్చు. ఇందుకోసం కొన్నిచోట్ల ఎథీలిన్‌ గ్యాస్‌ చాంబర్లను అద్దెకు ఇస్తున్నారు. గుంటూరులో ఈ సౌకర్యం లేదు… విజయవాడలో ఎథీలిన్‌ చాంబర్లు ఉన్నా వీటిని వ్యాపారులు అంతగా వినియోగించు కోవడంలేదు. ఇందుకు బదులుగా.. పండ్లపై ఎథీలిన్‌ రసాయనాలు చల్లి పండిస్తున్నారు. మార్కెట్‌లో చైనా ఎథిలీన్‌ ప్యాకెట్లు లభిస్తు న్నాయి. వీటికి అనుమతులు లేకపోయినా ఉన్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఎఽథిలీన్‌ ప్యాకెట్లను నీటిలో తడిపి మామిడి, అరటి పళ్ల మధ్యన పడేస్తున్నారు. ప్లాస్టిక్‌ ట్రేలలో కాగితాలతో గట్టిగా ప్యాక్‌ చేయడంతో ఇవి ఉబ్బి రసాయనాలు వెదజల్లడం ద్వారా మామిడి.. పండు మాదిరిగా మారుతుంది. నాలుగు రోజుల్లోపే రంగు మారేలా ఎక్కువ మోతాదులో వాడేస్తుండటంతో మధుర ఫలాలు విషతుల్యాలుగా మారుతున్నాయి. ఇలా నేరుగా ఎథిలీన్‌ వినియోగించకూడదనే నిబంధనలు ఉన్నా ఆచరణలో మాత్రం అధికారులు వీటిని అడ్డుకోలేకపోతున్నారు.
 
మార్కెటింగ్‌ శాఖ ఏం చేస్తోంది?
కొంతమంది వ్యాపారులు రసాయనాల వల్ల ప్రజారోగ్యం దెబ్బతిన్నా మాకేం నష్టం లేదు…మా లాభం మాకుంటే చాలు అనే రీతిలో వ్యవహరిస్తున్నారు. పండ్ల వ్యాపారులపై నిఘా ఉంచి కట్టడి చేయాల్సిన వ్యవసాయ మార్కె టింగ్‌ శాఖ, ప్రజారోగ్య శాఖ, విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, కార్పొరేషన్‌ ప్రజారోగ్య శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినవస్తున్నాయి. మామిడి పండు ఎలాంటి స్థితిలో వినియోగదారుడికి చేరుతుందనే విషయంపై సంబంధిత శాఖ అధికారులు దృష్టి సారించడం లేదు. దీంతో మధుర ఫలం కాస్తా విష తుల్యమై పోతోంది.
 
మామిడికి మంచి డిమాండ్‌
వేసవి సీజన్‌లో గుంటూరు, కృష్ణా జిల్లాలో మామిడి పండ్ల వ్యాపారం జోరుగా సాగుతుంది. నూజివీడు, తిరువూరు, మైలవరం, ఈదర, జంగారెడ్డిగూడెం తదితర ప్రాంతాల నుంచి మామిడి పండ్లు గుంటూరు, విజయవాడ మార్కెట్‌కు వస్తాయి. బంగినపల్లి రకం మామిళ్లకు ఉత్తరాది రాష్ట్రాల్లో మంచి డిమాండ్‌ ఉంటుంది. ఈ కారణంగా బంగినపల్లి రకం విజయవాడ నుంచి ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై తదితర ప్రాంతాలకు భారీగా ఎగుమతి జరుగుతుంది. ఏప్రిల్‌, మే నెలల్లో మామిడి పండ్లకు చక్కటి సీజన్‌. కొద్ది కాలంగా వర్షాలు ఆశించిన స్ధాయిలో లేకపోవడంతో ఈ ఏడాది మామిడి దిగుబడి తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఈ కారణంగా ఈ సీజన్‌లో మామిడికి రిటైల్‌ మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఏర్పడింది. మార్కెట్‌లో ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొన్న వ్యాపారులు మామిడి కాయలను కృత్రిమంగా రసాయనాలతో మాగబెట్టి మార్కెట్‌కి తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *