పారిశ్రామికవేత్త రతన్‌టాటా ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్‌తో భేటీ


నాగపూర్ : పార్లమెంటు ఎన్నికల వేళ ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌టాటా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అధినేత మోహన్ భగవత్‌తో భేటీ అవడం సంచలనం రేపింది. ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయమున్న నాగపూర్ నగరంలో రతన్ టాటా మోహన్ భగవత్ ను కలిసి మాట్లాడారు. రెండుగంటల పాటు సాగిన ఈ భేటీ కేవలం మర్యాదపూర్వకంగా సాగిందేనని ఆర్ఎస్ఎస్ వర్గాలు వెల్లడించాయి. రెండేళ్ల క్రితం 2016 డిసెంబరు 28వతేదీన రతన్ టాటా మోహన్ భగవత్ ను మొట్టమొదటిసారి కలిశారు. రతన్ టాటా మోహన్ భగవత్ తో భేటీ కావడం ఇది రెండోసారి. మోహన్ భగవత్ ను కలిశాక రతన్ టాటా ముంబయికు పయనమయ్యారు. గత ఏడాది ఆగస్టు నెలలో ఆర్ఎస్ఎస్ నాయకుడు నానా పాలేకర్ శతజయంతి ఉత్సవాలకు ముఖ్యఅతిధిగా విచ్చేసిన రతన్ టాటా ఆర్ఎస్ఎస్ అధినేతతో వేదికను పంచుకున్నారు. దేశంలో పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్న తరుణంలో రతన్ టాటా మోహన్ భగవత్ ను కలవడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. చాలామంది పారిశ్రామికవేత్తలు వివిధ రాజకీయ పార్టీలకు, సంస్థలకు ఆర్థిక సహకారం అందిస్తున్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *