పారిస్- ముంబై విమానంలో సాంకేతిక లోపం…అత్యవసరంగా ఇరాన్‌లో ల్యాండింగ్


టెహరాన్ : పారిస్ నుంచి ముంబై నగరానికి రావాల్సిన ఎయిర్ ఫ్రాన్స్ జెట్ లైనర్ విమానంలో సాంకేతిక లోపం ఏర్పడటంతో దాన్ని అత్యవసరంగా ఇరాన్ దేశంలోని ఇస్పహాన్ విమానాశ్రయంలో దించారు. ఏఎఫ్ 218 ఎయిర్ ఫ్రాన్స్ జెట్ లైనర్ విమానం దుబాయ్ మీదుగా ముంబై నగరానికి రావాల్సి ఉండగా మధ్యలో విమానం వెంటిలేషన్ సర్క్యూట్ లో సాంకేతిక లోపం ఏర్పడింది. ఇస్పహాన్ విమానాశ్రయంలో స్థానిక విమాన సాంకేతిక నిపుణులు సాంకేతిక లోపాన్ని సరిదిద్దారు. అనంతరం ఈ విమానం దుబాయ్ లోని అల్ మక్తూన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోనుంది. విమానంలోని ప్రయాణికులంతా క్షేమమేని వారికి ఇరాన్ దేశీయులు సేవలు అందించారని ఎయిర్ ఫ్రాన్స్ అధికారులు చెప్పారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *