‘పాలిసెట్‌’లో 84% పాస్‌


  • బాలురలో 82%.. బాలికల్లో 87% ఉత్తీర్ణత.. ర్యాంక్‌కార్డులు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు
  • 24 నుంచి అడ్మిషన్‌ కౌన్సెలింగ్‌ మొదలు
  • సాంకేతిక విద్య స్పెషల్‌ 
  • కమిషనర్‌ పాండాదాస్‌ వెల్లడి
అమరావతి, మే 9(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్స్‌లో ప్రవేశాల కోసం గత నెల 30న నిర్వహించిన ‘పాలిసెట్‌-2019’ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ఉదయం 11 గంటలకు విజయవాడ(స్టేట్‌ టెస్ట్‌హౌ్‌స)లో రాష్ట్ర సాంకేతిక విద్య శిక్షణ మండలి కార్యదర్శి దత్తుతో కలిసి రాష్ట్ర సాంకేతిక విద్య స్పెషల్‌ కమిషనర్‌ జి.ఎస్‌.పాండాదాస్‌ ఈ ఫలితాలు విడుదల చే శారు. ‘పాలిసెట్‌’ రాసేందుకు 1,31,931మంది రిజిస్టర్‌ కాగా… వీరిలో 1,24,899 మంది హాజరయ్యారు. వీరిలో 1,05,329(84%) మంది ఉత్తీర్ణులయ్యారు. పాసైన వారిలో 70,051 (82% ) మంది బాలురు, 35,278(87%) మంది బాలికలు ఉన్నారు.
 
పాలిసెట్‌ 120 మార్కులకు నిర్వహించగా, 30శాతం (36 మార్కులు) పొందిన వారిని ఉత్తీర్ణులైనట్లు ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ కేటగిరీ విద్యార్థులకు అర్హత మార్కులు లేవు. పరీక్ష రాసిన వీరందరికీ ర్యాంకులు కేటాయించారు. రాష్ట్రంలో 295 పాలిటెక్నిక్స్‌ (84 ప్రభుత్వ, 2 ఎయిడెడ్‌, 209 ప్రైవేట్‌), వాటిల్లో 75,971 సీట్లకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) అనుమతి లభించిందని సాంకేతిక విద్య స్పెషల్‌ కమిషనర్‌ జి.ఎ్‌స.పాండాదాస్‌ తెలిపారు. అర్హులైన అభ్యర్థులు తక్షణమే ర్యాంక్‌కార్డులు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని చెప్పారు.
 

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *