పీఆర్పీ సమయంలో అంతా ఆశతో వచ్చారు.. పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు


మంగళగిరి: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మంగళగిరిలో ఆదివారం పార్టీ అభ్యర్థులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీఆర్పీ సమయంలో అంతా ఆశతో వచ్చారని, ఆశయంతో ఎవరూ రాలేదని వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ మాత్రం ఆశయాలతో ముందుకు వెళుతుందని స్పష్టం చేశారు. తనకు ఓటమి భయం లేదని, ఫలితం ఎలా ఉంటుందనే భయం లేదని చెప్పారు. ఎన్ని సీట్లు వస్తాయన్న అంశంపై దృష్టి పెట్టలేదని, ఎంత పోరాటం చేశామన్న అంశం మీదే తన ఆలోచన అని పవన్ తెలిపారు.
 
ప్రతికూల పరిస్థితుల్లోనే వ్యక్తిత్వం బయటకు వస్తుందని, ఎవరి మనసులో అయినా మోసం చేయాలన్న భావన వస్తే అది తనను మోసం చేసినట్టు కాదని, వారిని వారే మోసం చేసుకున్నట్లు అని ఆయన చెప్పుకొచ్చారు. మార్పు అన్నది గొప్ప అంశమని, ఎమ్మెల్యే అన్నది చిన్న అంశమని.. మార్పు మొదలైందని.. అది గుర్తుపెట్టుకోవాలని పవన్ కల్యాణ్ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను ఉద్దేశించి ప్రసంగించారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *