‘పుల్వామా’ వల్లే!


  • భారత విదేశాంగ శాఖ ప్రకటన
న్యూఢిల్లీ, మే 2: మసూద్‌ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటిస్తూ చేసిన తీర్మానంలో ‘పుల్వామా దాడి’ ప్రస్తావన లేదు. అయినప్పటికీ… భద్రతా మండలి నిర్ణయంలో పుల్వామా దాడే కీలక పాత్ర పోషించిందని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రవీశ్‌ కుమార్‌ గురువారం స్పష్టం చేశారు. ఏది ఏమైనప్పటికీ… మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా నిర్ధరించడమే ముఖ్య పరిణామమని తెలిపారు. ఈ విషయంలో ఇప్పటిదాకా ఉన్న ‘సాంకేతిక అడ్డంకి’ని తొలగించిన చైనా నిర్ణయాన్ని రవీశ్‌ స్వాగతించారు. నిజానికి, మసూద్‌ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని 2009 నుంచి భారత్‌ ప్రయత్నిస్తోంది. అమెరికా కూడా దీనికి మద్దతుగా నిలుస్తోంది. కానీ… చైనా తన ‘వీటో’ అధికారంతో మసూద్‌ను కాపాడుతూ వస్తోంది. కశ్మీర్‌ ఉగ్రవాద చరిత్రలోనే కనీవినీ ఎరుగని రక్తపాతం సృష్టించిన పుల్వామా దాడి నేపథ్యంలో… మసూద్‌పై వేటుకు సహకరించక తప్పలేదు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *