పూజలపేరిట ఇద్దరు మహిళలపై అత్యాచారం…ఆస్ట్రేలియాలో ఆధ్యాత్మిక గురు బాగోతం


ప్రయాగరాజ్ : ఆస్ట్రేలియాలో ఓ ఆధ్యాత్మిక గురువు కీచక బాగోతం బట్టబయలైంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగరాజ్ (అహ్మదాబాద్) బడీ హనుమాన్ దేవాలయం మహంత్. ఆధ్యాత్మిక గురు ఆనంద్ గిరి ఆస్ట్రేలియాలో పూజల పేరిట ఇద్దరు మహిళలపై అత్యాచారం జరిపిన బాగోతం వెలుగు చూసింది. ఆధ్యాత్మిక గురు ఆస్ట్రేలియా దేశ పర్యటనలో భాగంగా సిడ్నీ నగరంలోని ఇద్దరు మహిళల ఇళ్లకు వెళ్లి పూజల పేరిట వారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. సిడ్నీలోని ఒక్సలే పార్కు ప్రాంతంలోని ఓ ఇంట్లో ఉన్న ఆనంద్ గిరిని ఆస్ట్రేలియా పోలీసులు అరెస్టు చేశారు. సిడ్నీ వెస్ట్ లోని రూటీహిల్స్ ప్రాంతంలోని ఓ మహిళ ఇంట్లో పూజ చేస్తానంటూ 29 ఏళ్ల మహిళపై ఆమె పడకగదిలోనే అత్యాచారం జరిపాడు. గురువు మరో 34 ఏళ్ల మహిళ ఇంట్లో పూజలు చేస్తూ ఆమెపై అత్యాచారం చేశాడు. ఇద్దరు మహిళల ఫిర్యాదు మేర ఆస్ట్రేలియా పోలీసులు గురువు ఆనంద్ గిరిని అరెస్టు చేసి పరామట్టా కోర్టులో ప్రవేశపెట్టగా కోర్టు అతనికి బెయిలు నిరాకరించింది. దక్షిణ భారతదేశానికి చెందిన బాధిత మహిళ కుంభమేళా సందర్భంగా ప్రయాగరాజ్ సందర్శించినపుడు ఈ గురువు ఆనంద్ గిరి పరిచయమై పూజలు చేసేందుకు ఆస్ట్రేలియా వచ్చారని పోలీసులు చెప్పారు. గురువు ఆనంద్ గిరి అరెస్టును అఖిల భారతీయ అఖండ్ పరిషత్ అధ్యక్షుడు నరేంద్రగిరి సైతం ధ్రువీకరించారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *