పూర్తి ఫలితాలు 24నే : ఈసీ


న్యూఢిల్లీ, మే 8: లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఒకరోజు ఆలస్యం కానున్నాయి. పూర్తి ఫలితాలు ఈనెల 24 నాడు వెలువడతాయని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. వీవీప్యాట్ల సంఖ్యలో పెరుగుదల వల్లే ఈ ఆలస్యం అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ అధికారి చెప్పారు. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఫలితాలను మే 23న విడుదల చేయాలని, కానీ వీవీప్యాట్ల సంఖ్య పెరిగినందువల్ల లెక్కింపులో ఐదు నుంచి ఆరు గంటలు జాప్యం జరుగుతుందని, ఈ నేపథ్యంలో మే 24 నాడే పూర్తి ఫలితాలు ప్రకటిస్తామని ఆయన తెలిపారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *