పేదలకు సేవ చేసే దృక్పథం ఉండాలి


పాండిచ్చేరి ట్రైనీ కలెక్టర్‌, డాక్టర్‌ లక్ష్మయ్య ఐఏఎస్‌ స్టడీ సర్కిల్‌ పూర్వ విద్యార్థి అభిషేక్‌
 
గుంటూరు (ఆంధ్రజ్యోతి): పేదలకు సేవ చేసే దృక్పథం ఉండాలని పాండిచ్చేరి ట్రైనీ కలెక్టర్‌, డాక్టర్‌ లక్ష్మయ్య ఐఏఎస్‌ స్టడీ సర్కిల్‌ పూర్వ విద్యార్థి పీ అభిషేక్‌ తెలిపారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆదివారం ఏపీ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ జేఏసీ, డాక్టర్‌ లక్ష్మయ్య ఐఏఎస్‌ స్టడీ సర్కిల్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూపీఎస్సీ సివిల్స్‌ ఫలితాల్లో 2017, 2018లో వరుసగా ఏడో ర్యాంకును డాక్టర్‌ లక్ష్మయ్య ఐఏఎస్‌ స్టడీ సర్కిల్‌ సాధించిందన్నారు. ఈ సంస్థలో తీసుకున్న శిక్షణతోనే ఐఏఎస్‌గా ఎంపికైనట్లు చెప్పారు. గుంటూరు జిల్లా డిప్యూటీ కలెక్టర్‌ పీ రచన, ఏపీ కాపు కార్పొరేషన్‌ ఎండీ కే శివశంకర్‌, ఏపీ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ జేఏసీ చైర్మన్‌ కేవీ కృష్ణయ్య, రాష్ట్ర ప్రభుత్వ సాంకేతిక సలహాదారు విజయ్‌కుమార్‌, విజయవాడ ఏఎస్పీ వర్మ పాల్గొన్నారు. అనంతరం డాక్టర్‌ పీవీ లక్ష్మయ్య విద్యార్థులు, తలిదం డ్రులు అడిగిన పలు సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమాన్ని పరిపాలన అధికారి గుర్రాల మోహనకృష్ణ పర్యవేక్షించారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *