పొటాటో రైతులపై కేసులు ఉపసంహరించుకున్న పెప్సికో


అహ్మదాబాద్: రైతుల ఆందోళనలతో పెప్సికో ఇండియా సంస్థ వెనుకడుగు వేసింది. బంగాళాదుంపలు పండించే గుజరాత్‌ రైతులపై పెట్టిన కేసులన్నింటినీ పెప్సికో సంస్థ శుక్రవారంనాడు ఉపసంహరించుకుంది. ఆహారం, శీతల పానీయల జెయింట్‌గా పేరున్న పెప్సికో ఇండియా హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఓ రకం బంగాళాదుంపపై తాము పేటెంట్ తీసుకున్నామని, తాము పేటెంట్ పొందిన బంగాళాదుంపలను గుజరాత్ రైతులు పండించారంటూ ఇటీవల కొందరిపై కేసులు పెట్టింది. పెద్దఎత్తున పరిహారం డిమాండ్ చేసింది.
 
ఈ అంశం మొదట్లో అంతగా ప్రచారంలోకి రాకపోయినప్పటికీ, రైతులు పెద్దఎత్తున ఆందోళనకు దిగడంతో ఊరూవాడా ప్రచారం జరిగింది. దేశవ్యాప్తంగా ఆందోళనకు రైతులు సమాయత్తం అవుతున్న నేపథ్యంలో రైతులపై పెట్టిన కేసులపై పెప్సికో కంపెనీ పునరాలోచన చేస్తున్నట్టు ఆ కంపెనీ ప్రతినిధులు గత వారం వెల్లడించారు.
 
ఈ క్రమంలో అహ్మదాబాద్‌లోని కమర్షియల్ కోర్టులో నలుగురు రైతులు, నార్త్ గుజరాత్‌లోని మొదసలోని జిల్లా కోర్టులో ఐదుగురు రైతులపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకున్నట్టు పెప్పికో ఇండియా ఇవాళ ప్రకటించింది. దీంతో తాము రైతులపై పెట్టిన అన్ని లీగల్ కేసులను ఉపసంహరించుకున్నట్టయిందని తెలిపింది. కాగా, రైతు హక్కుల సంస్థలు మాత్రం అప్రమత్తంగా ఉన్న ప్రజలే పెప్సికో ఇండియాకు గుణపాఠం చెప్పారని, ఇప్పుడు ప్రభుత్వం వంతని, రైతుల హక్కులను పరిరక్షించేందుకు ప్రభుత్వం ఇప్పటికైనా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలిన డిమాండ్ చేశాయి.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *