పొలిటికల్ ట్విస్ట్.. కేసీఆర్‌కు రఘువీరారెడ్డి లేఖ!


అమరావతి: కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ప్రాంతీయ పార్టీల మద్దతును కూడగట్టుకునే పనిలో పడింది. అందులో భాగంగా టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి లేఖ రాశారు. ప్రత్యేక హోదాకు దశల వారీగా మద్దతు తెలిపినందుకు ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఆయన లేఖలో పేర్కొన్నారు. ప్రత్యేక హోదా ఇచ్చేందుకు బీజేపీ తిరస్కరించిందని, కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ ప్రత్యేక హోదాపైనే తొలి సంతకం చేస్తానని ప్రకటించారని రఘువీరా గుర్తుచేశారు.
 
అందువల్ల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మద్దతు తెలపాల్సిందిగా రఘువీరా కేసీఆర్‌ను కోరారు. టీఆర్‌ఎస్ మాత్రమే కాదు ఏపీలోని ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలు కూడా ప్రత్యేక హోదా ఇచ్చే కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మద్దతు తెలపాలని ఆయన చెప్పారు. ఏపీకి అన్యాయం చేసిన బీజేపీకి మద్దతు తెలపవద్దని రఘువీరా సూచించారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *