పోర్టు ఆధారిత పరిశ్రమలతో అభివృద్ధి


  • బందరు చుట్టూ 47 కిలోమీటర్ల మేర ఔటర్‌ రింగ్‌ రోడ్డు
  • తాగునీరు, విద్య, వైద్యం, పారిశుధ్యం, రోడ్డు, రైల్వే కనెక్టవిటీపై ప్రత్యేక దృష్టి
  • నివేదిక పరిశీలించి మార్పులు చెబుతానన్న కలెక్టర్‌ ఇంతియాజ్‌
మచిలీపట్నం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ముడా) ద్వారా రూపొందించిన మచిలీపట్నం మెగా టౌన్‌ షిప్‌ నివేదికపై కలెక్టర్‌ ఇంతియాజ్‌ తన చాంబరులో శనివారం సమీక్ష నిర్వహించారు. ముడా వీసీ పి. విల్సన్‌బాబు ఆఽధ్వర్యంలో మచిలీపట్నం మెగా టౌన్‌షిప్‌ ప్రణాళికను రాయల్‌ హస్కనింగ్‌ సంస్థ ప్రతినిధులు పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌తో కలెక్టర్‌కు వివరించారు.
 
(ఆంధ్రజ్యోతి- మచిలీపట్నం): బందరు పోర్టు ఆధారిత, అనుబంధ పరిశ్రమల ఏర్పాటు ఎలా ఉంటుంది, దీని ద్వారా అభివృద్ధి ఎలా జరుగుతుంది .. మెగాటౌన్‌ షిప్‌ నిర్మాణం దశలవారీగా జరిగే విధానాన్ని రాయల్‌ హస్కనింగ్‌ సంస్థ ప్రతినిధులు కలెక్టర్‌ ఇంతియాజ్‌కు వివరించారు. కోన, చిన్నాపురం, పోలాటితిప్ప, పల్లెతుమ్మలపాలెం వైపు పరిశ్రమల ఏర్పాటు, మంగినపూడి, బుద్దాలపాలెం, అరిసేపల్లి వైపు మెగా టౌన్‌ షిప్‌ నిర్మాణం జరుగుతుందని తెలిపారు. తూర్పు
కోస్తా ఎకనమిక్‌ కారిడార్‌లో భాగంగా ఆర్థిక, ఉద్యోగ, ఉపాధి, అంశాలపై సమగ్ర ప్రణాళికను రూపొందించారు.
 
ముడా పరిధిలోకి
సీఆర్‌డీఏ పరిధిలో లేని ప్రాంతాలు 
 పోర్టు ఆధారిత పరిశ్రమల ఏర్పాటు, మెగా టౌన్‌ షిప్‌ నిర్మాణంలో భాగంగా సీఆర్‌డీఏ పరిధిలో లేని ప్రాంతాలను ముడాలో కలిపేందుకు ప్రణాళిక రూపొందించినట్లు రాయల్‌ హస్కనింగ్‌ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఖతార్‌ దేశంలో 36 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో పోర్టు నిర్మాణం, అక్కడ జరిగిన పారిశ్రామిక అభివృద్ధిని ఉదాహరణగా చూపారు. 2019 నుంచి 2051వ సంవత్సరం వరకు విడతల వారీగా పోర్టు ఆధారిత పరిశ్రమల ఏర్పాటు, మెగా టౌన్‌షిప్‌ నిర్మాణాన్ని వివరించారు. మొదటి విడతలో 14,467 ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్‌ భూముల్లో పరిశ్రమల, మెగా టౌన్‌షిప్‌ ఏర్పాటు ఉంటుందని వారు చెప్పారు. ప్రభుత్వ భూముల మధ్య పట్టా భూమి ఉంటే రైతుల నుంచి కొనుగోలు చేసే విధానాన్ని వివరించారు. ప్రస్తుతం ముడా పరిధి 402 చదరపు కిలోమీటర్లు కాగా సీఆర్‌డీఎలో లేని ప్రాంతా లను ముడాలో కలిపితే 1794 కిలోమీటర్లుగా ఉంటుందని తెలిపారు.
 
2051నాటికి మరింత అభివృద్ధి
మచిలీపట్నం 402 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉందని, దీని పరిఽధిని పెంచాలని సూచించారు. ప్రస్తుతం మచిలీపట్నంలో 60,083 విద్యుత్‌ కనెక్షన్లు ఉండగా 84 మెగావాట్ల విద్యుత్‌ను వినియోగిస్తున్నారని, 2051 నాటికి పారిశ్రామికంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందితే 1364 మెగావాట్ల విద్యుత్‌ను వినియోగించాల్సి ఉంటుందని వివరించారు. ప్రస్తుతం మచిలీపట్నంలో 9 నెలలు కాలువల ద్వారా తాగునీరు అందుతోందని, 16.38 ఎంఎల్‌డీల నీటిని వాడుతున్నారని 2051 నాటికి 3,300 ఎంఎల్‌డీల మేర తాగునీటి వినియోగం ఉంటుందని చెప్పారు. ప్రకృతి విపత్తుల బారిన పడకుండా పట్టణాన్ని కాపాడేందుకు మూడంచెలలో మడ అడవులను పెంచాల్సి ఉందన్నారు.
 
పరిధిని విస్తరిస్తే 44 వేల ఎకరాల
ప్రభుత్వ భూమి అందుబాటులోకి
 ముడి పరిధిలోకి మచిలీపట్నంకే కాకుండా గుడ్లవల్లేరు, పెడన, దివిసీమ ప్రాంతాలను చేరిస్తే 44 వేల ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులోకి వస్తుందని హస్కనింగ్‌ సంస్థ ప్రతనిధులు కలెక్టర్‌కు వివరించారు. ఈ భూమిలో పారిశ్రామిక అభివృద్ది చేయడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. తొలివిడతలో మచిలీపట్నంలో 14,462 ఎకరాల్లో పరిశ్రమల ఏర్పాటు, మెగా టౌన్‌షిప్‌ నిర్మాణం జరగుతుందని, దీనిలో ప్రభుత్వ భూమి 6,130, అసైన్డ్‌ భూమి 1,267, పట్టాభూమి 5,119 ఎకరాలు మిగిలినది ఇతరత్రా భూమి ఉందన్నారు. ప్రభుత్వ భూమిని బ్యాంకర్లకు తాకట్టుపెట్టి రుణాలు పొందే అవకాశం ఉందన్నారు. ఇందుకు ఎస్‌బీఐ, ఆంఽధ్రాబ్యాంకు, సిండికేట్‌ బ్యాంక్‌ లు ముందుకు వస్తున్నాయని తెలిపారు.
 
ఏడాదిలో ముందడుగు
ముడా వీసీ పి.విల్సన్‌బాబు మాట్లాడుతూ ఏడాది కాలంలో ముడా ద్వారా గణనీయమైన ప్రగతిని సాధించినట్లు చెప్పారు. పట్టాభూమిని రైతులనుంచి కొనుగోలుచే సేందుకు ప్రభుత్వం రూ. 200 కోట్లను విడుదల చేసిందని తెలిపారు. ఈ నగదుతో 450 ఎకరాల పట్టాభూమిని కొనుగోలు చేసి పోర్టు పనులను ప్రారంభించినట్లు తెలిపారు.
పరిరఽశమల స్థాపన జరిగితే వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. డీఆర్వో ఎ. ప్రసాద్‌, ఆర్‌డీవో ఉదయభాస్కర్‌, ముడా కార్యదర్శి సమజ, ముడా ప్రణాళికాధికారి శిల్పా, ముడా మాస్టర్‌ ప్లాన్‌ కన్సల్టెంట్‌ నిఖిల్‌, సలహాదారు విశ్వనాథ్‌, ప్రభుత్వ ఎకనమిక్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు ప్రతినిఽధి హజరత్‌ షేక్‌ పాల్గొన్నారు.
 
47 కిలోమీటర్ల ఔటర్‌ రింగ్‌ రోడ్‌
బందరు పోర్టును కలుపుతూ పట్ఠణం చుట్టూ సాగరమాల పథకంలో భాగంగా 47 కిలోమీటర ్లమేర ఔటర్‌ రింగ్‌ రోడ్‌ను 250 అడుగుల వెడల్పుతో ఆరులైన్లతో నిర్మాణం చేయాల్సి ఉంటుందని రాయల్‌ హస్కనింగ్‌ ప్రతినిధులు తెలియజేశారు. ఈ రోడ్డు నిర్మాణానికి రూ.1250 కోట్ల వ్యయం అవుతుందని వివరించారు. మచిలీపట్నం రైల్వే స్టేషన్‌ చివరి పాయింట్‌గా ఉందని రైల్వే లైనును విస్తరించి చిన్నాపురంలో రైల్వే స్టేషన్‌ నిర్మాణం చేయనున్నట్లు చెప్పారు. మెగా టౌన్‌షిప్‌లో 60 మీటర్ల వెడల్పుతో రోడ్లు నిర్మాణం చేయాలని సూచించారు.
 
నివేదిక అధ్యయనం చేసి
మార్పులు చెబుతా : కలెక్టర్‌
ముడా ఆధ్వర్యంలో తయారు చేసిన నివేదికను అధ్యయనం చేసి మార్పులు, చేర్పులపై తన అభ్రిపాయాన్ని చెబుతానని కలె క్టర్‌ ఇంతియాజ్‌ తెలిపారు. మచిలీపట్నం అభివృద్దికి తనవంతు కృషి చేస్తానని ఆయన తెలియజేశారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *