పోలవరం ప్రాజెక్ట్ సందర్శించనున్న చంద్రబాబు


అమరావతి: పోలవరం ప్రాజెక్టును సందర్శించాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 6వ తేదీ ఉదయం పోలవరం ప్రాజెక్ట్‌ను సీఎం సందర్శించనున్నారు. ఇదిలా ఉంటే గత నెల 11న ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన సంగతి తెలిసిందే. ఈనెల 23న ఫలితాలు వెలువడనున్నాయి. అయితే ఎన్నికల కోడ్ పేరుతో సీఎం చంద్రబాబు, మంత్రులను సమీక్షలు జరపకుండా ఈసీ అడ్డుకుంటోంది. దీంతో ఎన్నికల సంఘంతో ప్రభుత్వం ఫైటింగ్ చేస్తోంది. ఇతర రాష్ట్రాల్లో లేని రూల్స్ మాకేంటి? అని సీఎం నిలదీశారు. తాజాగా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోనైనా కోడ్ సవరించాలని ఈసీకి చంద్రబాబు లేఖ రాశారు. కానీ ఎలాంటి స్పందనరాలేదు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *