‘పోలీసు విభజన’ నేడు కొలిక్కి!


  • గవర్నర్‌ సమక్షంలో తుది పంపకాలు
అమరావతి, ఏప్రిల్‌ 28(ఆంధ్రజ్యోతి): ఏపీ, తెలంగాణ రాష్ట్రాల పోలీసు అధికారుల విభజన సోమవారం కొలిక్కిరానుంది. రాష్ట్ర విభజన తర్వాత వివిధ శాఖల ఉద్యోగుల విభజన పూర్తయినా పోలీసు శాఖకు సంబంధించిన డీఎస్పీ, అదనపు ఎస్పీ, నాన్‌ కేడర్‌ ఎస్పీల విభజన మాత్రం కొలిక్కిరాలేదు. 610 జీవో ప్రకారం హైదరాబాద్‌ జోన్‌లో నియమితులైన పోలీసు అధికారులు ఏపీలోని అన్ని జిల్లాల్లోనూ పనిచేస్తున్నారు. వారి విభజన ప్రక్రియ మాత్రం ఇప్పటి వరకు పెండింగ్‌లోనే ఉంది. అయితే, దీనిపై పలుదఫాల చర్చల అనంతరం సోమవారం గవర్నర్‌ నరసింహన్‌ సమక్షంలో తుది విభజన ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించారు. ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌, తెలంగాణ డీజీపీ మహేందర్‌ రెడ్డి సోమవారం హైదరాబాద్‌లో భేటీ అయి విభజన ప్రక్రియపై చర్చించిన అనంతరం గవర్నర్‌ను కలవనున్నారు. నరసింహన్‌ సమక్షంలో తుది ప్రక్రియ చేపట్టనున్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *