ప్రగ్యా సింగ్‌కు ప్రచారం చేసినా శివరాజ్ స్నానం చేయరు: దిగ్విజయ్ సింగ్


భోపాల్: సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ పార్టీల మధ్య విమర్శలు మరింత పదునెక్కుతున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పేరు ప్రస్తావించినప్పుడల్లా తాను స్నానం చేస్తానని మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ చేసిన వ్యాఖ్యలపై దిగ్విజయ్ తనదైన శైలిలో ప్రతిస్పందించారు. ప్రగ్యా సింగ్ ఠాగూర్‌కు ప్రచారం చేసినా శివరాజ్ సింగ్ స్నానం చేయరని ఎద్దేవా చేశారు.
 
‘‘నా పేరు ఆయన (శివరాజ్ సింగ్) ప్రస్తావించడానికి ఇష్టపడరట. ఎప్పుడైనా నా పేరు ప్రస్తావిస్తే స్నానం చేస్తానని అంటున్నారు. కానీ ఆయన ప్రతిరోజు ప్రగ్యా సింగ్ ఠాకూర్‌ (భోపాల్ బీజేపీ అభ్యర్థి) కోసం ప్రచారం చేస్తారు. అయినా స్నానం చేయరు’’ అని విమర్శలు గుప్పించారు.
 
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు అత్యంత ప్రధాన్యత కలిగిన నియోజకవర్గాల్లో మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్ ఒకటి. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పోటీ చేస్తుండగా, బీజేపీ నుంచి మాలేగావ్ పేలుళ్లతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రగ్యా సింగ్ ఠాగూర్ పోటీలో ఉన్నారు. ఇక్క ఎన్నిక ఆరవ దశలో పోలింగ్ జరగనుంది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *