ప్రజల సమస్యలు పట్టని ప్రధాని


  • పాక్‌, గతం, వివాదాల గురించే మాట్లాడతారు
  • రైతుల రుణమాఫీకి డబ్బులుండవు: ప్రియాంక
సిద్ధార్థ్‌నగర్‌/సంత్‌ కబీర్‌నగర్‌/అమేఠీ, మే 10: కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ మరోసారి ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. ప్రధానికి ప్రజల సమస్యలు పట్టవని, ఎప్పుడూ పాకిస్థాన్‌ గురించి మాట్లాడటం, గతాన్ని తవ్వితోడటం, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే ఆయన పని అని ఆరోపించారు. శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థ్‌నగర్‌, సంత్‌ కబీర్‌నగర్‌లో ఎన్నికల ప్రచార సభల్లో ఆమె మాట్లాడారు. ప్రధాని ఎప్పుడూ విదేశాల్లో తిరగడమే తప్ప.. ఒక్క నియోజకవర్గంలోనూ పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న దాఖలాలు లేవన్నారు. రైతుల రుణాలను మాఫీ చేయాలని కాంగ్రెస్‌ కోరితే.. ప్రభుత్వం వద్ద డబ్బు లేదంటారని, కానీ.. బడా పారిశ్రామికవేత్తలకు ఐదేళ్లలో రూ.5.5 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేశారన్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *