ప్రజాప్రతినిధులు ఏసీబీ పరిధిలోనే


  • ఏసీబీ డీజీగా బాధ్యతలు స్వీకరించిన ఏబీవీ
అమరావతి, ఏప్రిల్‌ 24(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రజా ప్రతినిధులు కూడా అవినీతి నిరోధక శాఖ పరిధిలోకి వస్తారని ఆ శాఖ డైరెక్టర్‌ జనరల్‌ ఏబీ వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. అవినీతిని అరికట్టేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. బుధవారం విజయవాడ ఆర్టీసీ హౌస్‌లోని ఏసీబీ కా ర్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో అవినీతి నిరోధక శాఖ బలోపేతమైందన్నారు. ప్రజలకు సేవ చేయాల్సిన కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఎమ్మెల్యేలు, ఎంపీల్లో ఎవరైనా లంచం అడిగితే తెలియజేయాలన్నారు. కనీస ఆధారాలతో టోల్‌ఫ్రీ నం.1064కుగానీ dgacb@ap.gov.inకి ఈమెయిల్‌ గానీ పంపవచ్చన్నారు. అలాగే 8333995858 నంబరుకు వాట్సాప్‌ చేయడం లేదా @dgacbap ట్విటర్‌ ఖాతాలోనూ, dgacbap ఫేస్‌బుక్‌ పేజీలో కూడా ఫిర్యాదు చేయవచ్చని వివరించారు కాగా, ఏసీబీ డీజీ వెంకటేశ్వరరావు బుధవారం సాయంత్రం సచివాలయంలో సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యంను మర్యాద పూర్వకంగా కలిశారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *