ప్రధాని మోదీ సభకు బందోబస్తు ఏ రీతిలో అంటే….



హర్యానా : హర్యానాలోని కురుక్షేత్రలో ప్రధాని మోదీ సభకు బందోబస్తు నిర్వహించిన పోలీసుల సంఖ్య తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ప్రధాని మోదీ కురుక్షేత్రలో ప్రచార సభలో పాల్గొన్నారు. అయితే ఈ సభకు ఏకంగా 1,700 మంది పోలీసులను తాము బందోబస్తుకు వినియోగించామని స్థానిక ఎస్పీ ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రకటించారు. దాదాపు 20 మంది డీఎస్పీలను, ఐదుమంది ఎస్పీలను ఈ సభకు డిప్యూటేషన్ మీద పంపించామని ఆయన తెలిపారు. అంతేకాకుండా ఈ కురుక్షేత్రలో జరిగిన సభకు పక్క జిల్లాల నుంచి దాదాపు వెయ్యి మంది పోలీసులను పిలిపించామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ ప్రాంతానికి మోదీ రావడం ఇదే ప్రథమమని స్థానిక నేతలు తెలిపారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా కురుక్షేత్రను సందర్శించడం మాత్రం ఇది రెండోసారి. ఫిబ్రవరి 12 న స్వచ్ఛ శక్తి అనే కార్యక్రమంలో భాగంగా మోదీ పాల్గొన్నారు. 

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *