ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా ఏలూరులో ర్యాలీ


ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా జిల్లాలోని వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో మున్సిపల్ కార్మికులు, ఆశా వర్కర్స్, మున్సిపల్ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. మలేరియా నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని.. గ్రామపంచాయితీలలో మురికి గుంతలు, చెత్త చెదారం లేకుండా పలు జాగ్రత్తలు వహించాలని ఆయన అన్నారు. అనంతరం డియం అండ్. హెచ్ ఓ సుబ్రహ్మణ్యేశ్వరి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 174 మలేరియా కేసులు నమోదయ్యాయని, మలేరియా నిర్మూలనకు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది , ఆయా ప్రత్యేక పర్యవేక్షణ ద్వారా విద్యార్థులకు, ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *