‘ప్రభుత్వం కూలిపోతుందని బీజేపీ నేతలు కలలు కంటున్నారు’


బెంగళూరు: రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల అనంతరం భారీగా రాజకీయ పెనుమార్పులు జరుగుతాయని సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోతుందంటూ బీజేపీ నేతలు చేస్తున్న ప్రకటనలపై ఉప ముఖ్యమంత్రి డాక్టర్‌ జి .పరమేశ్వర మండిపడ్డారు. హుబ్లిలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం ఏదో జరిగిపోతుందని కలలు కంటున్న బీజేపీ నేతలకు నిరాశ తప్పదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఏర్పాటు గురించి కలలు కంటున్న బీజేపీ నేతలను ఆయన ఎద్దేవా చేశారు.
 
ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికై మెజార్టీతో ఉ న్న బీజేపీయేతర ప్రభుత్వాల ను కుప్పకూల్చడమే లక్ష్యంగా కేంద్రం కుట్రలు పన్నుతోందని ఆయన ఆరోపించారు. జమ్మూకాశ్వీర్‌లో ప్రభుత్వాన్ని కూలదోశానని గోవాలో అక్రమంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారని ఇప్పుడు కర్ణాటకలో దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయని ఆయన బీజేపీపై నిప్పులు చెరిగారు. రాజకీయాల్లో నైతిక విలువల గురించి చెప్పే బీజేపీ ఇంతటి దిగజారుడు రాజకీయాలు జరుపడం సిగ్గు చేటన్నారు. ఇదిలావుండగా మండ్య లోక్‌సభ ని యోజకవర్గంలో జేడీఎస్‌ అభ్యర్థి విజయానికి కొందరు స్థానిక కాంగ్రెస్‌ నేతలు పనిచేయలేదన్న కథనాలను ప్రస్తావించగా పార్టీ దీనిపై కూలంకుష పరిశీలన జరుపుతుందని ఒకవేళ నిజమని తేలితే చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *