ప్రభుత్వ కార్యాలయాల్లో ఆగిన ప్రైవేట్‌ మెయిల్స్‌


  •  వైరస్‌ దాడితో 2రోజులుగా ఆపేసిన ఐటీ శాఖ
అమరావతి, మే 4(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ కార్యాలయాల్లోని కంప్యూటర్లలో ప్రైవేట్‌ మెయిల్స్‌ను ఆపేశారు. సచివాలయంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని శాఖల్లోని కంప్యూటర్లలో జీమెయిల్‌, యాహూ మెయిల్‌ తదితర సైట్లు రెండురోజుల నుంచి పని చేయడం లేదు. వైరస్‌ దాడి జరిగిందన్న సమాచారంతో ఐటీశాఖ ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తోంది. అయితే ప్రైవేటు మెయిల్స్‌ ఆగిపోవడం వల్ల ప్రభుత్వ వ్యవహారాలకు ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రభుత్వం, అధికారులకు మధ్య అధికారిక మెయిళ్లు మామూలుగానే వెళ్తున్నాయి. వీటిని ఎన్‌ఏసీ ప్రత్యేకంగా నిర్వహిస్తుంది. వాస్తవానికి ప్రభుత్వ కార్యాలయంలో ప్రైవేట్‌ మెయిళ్లు వాడటం నిషేధం. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల స్వీకరణకు, ఇతరత్రా దరఖాస్తులకు ప్రభుత్వ కార్యాలయాల ఈమెయిల్‌ ఐడీలు మాత్రమే ఇవ్వాలి. వ్యక్తిగత మెయిల్స్‌ ఇవ్వకూడదు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *