ప్రయాణికులకు పానీయాలు


  • రైల్వే స్టేషన్లో శీతలపానీయాలు పంపిణీ చేస్తున్న స్వచ్ఛంద సంస్థలు
  • అదనంగా కుళాయిలతో రైల్వే శాఖ తాగునీరు పంపిణీ
ఆంధ్ర జ్యోతి విజయవాడ: వేసవిలో ఉష్ణోగ్రతలు పతాక స్థాయిలో ఉంటున్నాయి ! ప్రస్తుతం తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదౌతున్నాయి ! పది రోజులుగా ఎండలు అలమటించేస్తున్నాయ్‌ ! మరో పది రోజుల పాటు ఇంతకంటే ఎక్కువుగా 46 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో రైల్వే అధికారులు ప్రయా ణికులను చల్లబరిచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దేశంలో రెండో అతిపెద్దదైన విజయవాడ రైల్వేస్టేషన్‌ అత్యంత రద్దీగా ఉంటుంది. ప్రతి రోజూ రెండు లక్షల మంది ప్రయాణికులు రైల్వేస్టేషన్‌కు రాకపోకలు సాగిస్తుంటారు. సుదూర ప్రాంతాల నుంచి రైళ్లలో మగ్గిపోయి స్టేషన్‌కు వచ్చేవారికి చల్లటి సాంత్వన కలిగించటానికి శీతల పానీయాలను అందించాలని రైల్వేస్టేషన్‌ ఉన్నతాధికారులు నిర్ణయించారు. తమ ఆలోచనకు కార్యరూపం ఇవ్వటానికి దాతల సహకారాన్ని తీసుకున్నారు. దీంతో ఇప్పుడు రైల్వేస్టేషన్‌లో వివిధ సంస్థలు, స్వచ్చంద సంస్థలు పెద్ద ఎత్తున శీతల పానీయాలను అందిస్తున్నాయి. పది రోజులుగా ప్లాట్‌ఫామ్‌ నెంబర్‌ 1, 2, 3, 4,5లలో జనరల్‌ కోచ్‌లలో ఉండే ప్రయాణికులకు అమృతహస్తం స్వచ్ఛంద సంస్థ చల్లటి తాగునీటిని పంపిణీ చేస్తోంది. మంచినీటితో పాటు ఈ సంస్థ ప్రయాణికులకు చల్లటి మజ్జిగను కూడా పంపిణీ చేస్తోంది. మోడరన్‌ అకాడమీ సంస్థ ప్లాట్‌ఫామ్‌ – 1లో జనరల్‌ కోచ్‌ ప్రయాణికులు వెయ్యి మందికి చల్లటి మజ్జిగ, మంచినీటిని అందిస్తోంది. ప్లాట్‌ఫామ్‌ – 6, 7 లలో జనరల్‌ కోచ్‌లో ఉన్న ప్రయాణికులకు ది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కాస్ట్‌ అక్కౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా సహకారంతో చల్లని నీరు, మజ్జిగ పంపిణీ చేపడుతున్నారు. రైల్వే శాఖ కూడా ప్లాట్‌ఫామ్‌ 1 నుంచి 10 వరకు అదనంగా కుళాయిలను ఏర్పాటు చేసి ప్రయాణికులకు చల్లటి నీటిని అందిస్తోంది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *