ప్రశాంతంగా ఏపీఆర్‌జేడీసీ సెట్‌


గుంటూరు(విద్య), మే 9: గురుకుల జూనియర్‌, డిగ్రీకళాశాలల్లో ప్రవేశాల కోసం గురువారం నిర్వహించిన ఏపీఆర్‌జేడీసీ సెట్‌ ప్రశాంతంగా ముగిసింది. ఏపీ రెసిడెన్షియల్‌ విద్యాసంస్థల సోసైటీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఏడు జూనియర్‌ కళాశాలలు, రెండు డిగ్రీ కళాశాలల్లో ఈ పరీక్ష నిర్వహించారు. గుంటూరులోని కొన్ని కేంద్రాలను సంస్థ కార్యదర్శి నాగభూషణశర్మ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీఆర్‌జేడీసీ పరీక్షకు 67,867 మంది (89.62 శాతం), డిగ్రీ కళాశాలల్లో ప్రవేశానికి 8,657 మంది (85.01శాతం) హాజరయ్యారని తెలిపారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *