ప్రియాంక, రాబర్ట్‌వాద్రాల వివాహం వెనుక…


న్యూఢిల్లీ: యూపీఎ చైర్‌పర్సన్ సోనియా గాంధీ అల్లుడు, ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రా నేడు పుట్టిన రోజు చేసుకుంటున్నారు. 1969 ఏప్రిల్ 18న ఉత్తరప్రదేశ్‌లోని మురాదాబాద్‌లో రాబర్ట్ వాద్రా జన్మించారు. ప్రియాంక తొలిసారి రాబర్ట్ వాద్రాను తన 13వ ఏట కలుసుకున్నారు. మంచి స్నేహితులుగా మారిన వీరి మధ్య ప్రేమ చిగురించింది. వ్యాపారరంగంలో స్థిరపడిన కుటుంబానికి చెందిన రాబర్ట్ వాద్రాకు రాజకీయాలతో పెద్దగా పరిచయం లేదు. ప్రియాంక, రాబర్ట్ వాద్రా ఒకే స్కూలులో చదువుకునేవారు. రాబర్ట్ వాద్రా సోదరి మిషెల్ వాద్రా కారణంగా ప్రియాంక, రాబర్ట్‌ల మధ్య పరిచయం ఏర్పడింది. రాబర్ట్ వాద్రా కుటుంబం జ్యూయలరీ బిజినెస్ నిర్వహిస్తుంటుంది. దీంతో రాబర్ట్ వాద్రా … ప్రియాంకకు నగలను బహుమతులుగా ఇచ్చేవారు. ఈ సమయంలోనే రాబర్ట్ వాద్రా… ప్రియాంక సోదరుడు రాహుల్ గాంధీకి మంచి స్నేహితునిగా మారారు. అయితే ప్రియాంక ఒకసారి మురాదాబాద్ వచ్చినప్పుడు వీరి ప్రేమ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. అయితే తమ అనుబంధం గురించి ఎవరికీ తెలియకూడదని రాబర్ట్ వాద్రా భావించేవారట. రాబర్ట్ వాద్రా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘ తాము ఢిల్లీలోని బ్రిటీష్ పబ్లిక్ స్కూల్‌లో చదువుకుంటున్నప్పుడు కలుసుకున్నామని తెలిపారు. మేమిద్దరం కలుసుకుని మాట్లాడుకునే వాళ్లం. అయితే ఇది ఎవరికీ తెలియకూడదని అనుకునేవాడిని. ఎందుకంటే ఎవరైనా తప్పుగా అనుకుంటారేమోనని అనిపించేది’ అని అన్నారు. 1997 ఫిబ్రవరి 18న వీరి వివాహం జరిగింది. హిందూ సంప్రదాయంలో సోనియాగాంధీ సమక్షంలో వివాహ వేడుక జరిగింది. వీరికి మారియా వాద్రా, రెహాన్ వాద్రా అనే ఇద్దరు పిల్లలున్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *