ప్రేమజంట ఆత్మహత్య ప్రియుడు మృతి .. కొనఊపిరితో ప్రియురాలు.. లేఖ లభ్యం


విశాఖపట్నం: జిల్లాలోని పర్యాటక ప్రాంతం కైలాసగిరిలో ప్రేమ జంట ఆత్మహత్యకు యత్నించింది. ప్రియుడు అక్కడికక్కడే మృతి చెందగా.. ప్రియురాలు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. విషయం తెలుసుకున్న స్థానికులు, పోలీసులు హుటాహుటిన 108కు కాల్‌చేసి ప్రియురాలిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రియురాలు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. బాదం పాలు బాటిల్‌లో విషం కలుపుకుని తాగి ప్రేమజంట ఆత్మహత్యకు యత్నించింది. ప్రేమజంట పక్కనే రెండు బాదంపాలు బాటిళ్లు ఉన్నాయి. మృతుడు సత్యనారాయణగా పోలీసులు గుర్తించారు. యువతిని కమలగా లెటర్ ఆధారంగా పోలీసులు గుర్తించారు. కాగా వీళ్లు ఎందుకు ఆత్మహత్యకు యత్నించారు..? అనే విషయం తెలియాల్సి ఉంది. అరిలోవ పోలీసులు ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.
 
కమల లేఖ..
ఇదిలా ఉంటే కమల తన తమ్ముడికి ఓ లేఖ రాసింది.శివ.. అమ్మను జాగ్రత్తగా చూసుకో.. నువ్వు ఉన్నావనే నమ్మకంగా నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. అలాగే దేవిని జాగ్రత్తగా చూసుకో. రెండు కుటుంబాల్లో గొడవలొద్దు.. మీరు కూడా గొడవ పడకండి.. మా ఇద్దర్ని క్షమిస్తారని కోరుకుంటున్నానుఅని కమల లేఖలో పేర్కొంది. ఈ లేఖ పూర్తిగా చదివిన జనాలు భావోద్వేగానికి లోనవుతున్నారు. 
 
 

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *