‘ఫణి’ ఎఫెక్ట్: ఒడిశాలో అలముకున్న అంధకారం…నాసా శాటిలైట్ చిత్రాల విడుదల


భువనేశ్వర్ : ఒడిశాలో అల్లకల్లోలం సృష్టించిన ఫణి తుపాన్ అనంతరం ఒడిశాలో నెలకొన్న పరిస్థితులపై అంతరిక్ష చిత్రాలను అమెరికా దేశానికి చెందిన శాటిలైట్ ఏజెన్సీ నాసా గురువారం విడుదల చేసింది. ఈ నెల 3వతేదీన సంభవించిన తుపాన్ వల్ల గంటకు 200 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులతో ఒడిశా సముద్ర తీర ప్రాంత నగరాలు, గ్రామాల్లో తీవ్ర నష్టం జరిగింది. తుపాన్ వల్ల పూరి, భువనేశ్వర్, కటక్, ఖుర్దా నగరాల్లో పలువురు మరణించగా, మిలియన్ల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. తుపాన్ ప్రభావం వల్ల ఒడిశా తీర ప్రాంతంలోని నగరాలు, గ్రామాల్లో 3.5 మిలియన్ల ఇళ్లు దెబ్బతిన్నాయి. గాలుల వల్ల విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో 3.5 మిలియన్ల గృహాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చెట్లు కూలిపోవడంతో టెలీకమ్యూనికేషన్ల వ్యవస్థ, మొబైల్ టవర్లు దెబ్బతిన్నాయి. ఫణి తుపాన్ కు ముందు ఏప్రిల్ 30వతేదీన ఒడిశా తీరంపై తీసిన ఫోటో, తుపాన్ అనంతరం మే 4వతేదీన తీసిన చిత్రాలను నాసా విడుదల చేసింది. తుపాన్ అనంతరం విద్యుత్ సరఫరా వ్యవస్థ చిన్నాభిన్నం కావడంతో ఒడిశా తీరంలో అంధకారం నెలకొంది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *