ఫణి తుపాను అప్‌డేట్


విశాఖపట్టణం: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర తుఫాను అతి తీవ్ర తుఫానుగా మారింది. ఇది మరింతగా బలపడి రాబోయే 24 గంటల్లో పెను తుఫాన్‌గా మారనుంది.
ప్రస్తుతం పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తోంది. బుధవారం నాటికి దిశ మార్చుకొని ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తుంది. ఇది ప్రస్తుతం విశాఖపట్నానికి తూర్పు ఆగ్నేయంగా 670 కిలోమీటర్లు, దక్షిణంగా పూరికి 830 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది.
 
తుపాను ఒరిస్సాలో తీరం దాటనుంది. ఈరోజు దక్షిణ కోస్తాలో పలుచోట్ల వర్షాలు పడే అవకాశం ఉంది. రేపటి నుంచి మిగతా కోస్తా జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తాయి. 2, 3 తేదీల్లో ఉత్తర కోస్తాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయి. మూడో తేదీన ఉత్తర కోస్తాలో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. తీరం వెంబడి బలమైన గాలులు ఉంటాయి. 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.
మత్స్యకారులు వేటకు వెళ్లకూడదు. అన్ని పోర్టుల్లో రెండో నంబర్ హెచ్చరిక కొనసాగుతోంది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *