‘ఫణి’ తుపాన్ గాలులకు ఎవరెస్ట్ బేస్ క్యాంపులో కూలిన టెంట్లు


ఖాట్మండు : ఫణి తుపాన్ గాలుల ప్రభావం వందలాది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎవరెస్ట్ పర్వతంపై పడింది. ఫణి తుపాన్ వల్ల వీచిన గాలుల వల్ల ఈశాన్యభారత దేశంలోని ఎవరెస్ట్ బేస్ క్యాంపులో ఉన్న 20 టెంట్లు కుప్పకూలాయి. తుపాన్ గాలులు ఉధృతంగా వీస్తున్న నేపథ్యంలో ఎవరెస్ట్ పర్వతంపై ట్రెక్కింగ్ చేసే ఏజెన్సీలు, సిబ్బంది, పర్యాటకులకు నేపాల్ ప్రభుత్వం ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. భారీ గాలుల వల్ల ఎవరెస్ట్ బేస్ క్యాంపులో ఉన్న టెంట్లు కూలాయని, కాని పర్వతారోహకులు మాత్రం క్షేమంగా ఉన్నారని పర్యాటకశాఖ డైరెక్టరు మీరా ఆచార్య చెప్పారు. తుపాన్ ప్రభావం వల్ల గాలితోపాటు మోస్తరు వర్షం కురిసింది. దీంతో వాతావరణం మెరుగుపడేదాకా ఎవరెస్ట్ పర్వతం ఎక్కవద్దని పర్వతారోహకులకు పర్యాటక శాఖ ఆదేశించింది. తుపాన్ ప్రభావం వల్ల శనివారం హెలికాప్టర్ల రాకపోకలను నిలిపివేశారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *