‘ఫణి’ బాధితులకు అండగా కోస్టల్ గార్డ్స్, ఎన్డీఆర్ఎఫ్


భువనేశ్వర్: ఒడిశా తీర ప్రాంతం ‘ఫణి’ తుఫాన్ ధాటికి వణికిపోతోంది. ఫణి తుపాను బీభత్సం కారణంగా దక్షిణ ఒడిశా, ఉత్తరకోస్తా, తీర ప్రాంతాల్లో ప్రభుత్వం పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపడుతోంది.నిరాశ్రయులను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో కోస్టల్ గార్డ్స్, ఎన్డీఆర్‌ఎఫ్‌ దళాలు చురుగ్గా పని చేస్తన్నాయి. 4 వేల మందితో కూడిన 80 ఎన్డీఆర్‌ఎఫ్‌, ఓడ్రాఫ్‌ దళాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. 11 జిల్లాల్లోని 7.5 లక్షల మందిని సహాయక బృందాలు సురక్షిత కేంద్రాలకు తరలించాయి. గంజాం, గజపతి, పూరీ, ఖుర్ధా, కేంద్రపడ, జగత్సింగ్‌పూర్‌, కటక్‌, జాజ్‌పూర్‌, బాలేశ్వర్‌, భద్రక్‌, నయాగఢ్‌ జిల్లాల్లో 3వేలకు పైగా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *