ఫేస్‌బుక్‌ పరిచయంతో డాక్టర్‌ను నిండా ముంచేసిన యువతి


బెంగళూరు: ఫేస్‌బుక్‌లో పరిచయమై తనకు తానుగా డాక్టర్‌గా పరిచయం చేసుకున్న లండన్‌ యువతి ఉడిపి జిల్లా బ్రహ్మవర హందాడి నివాసి డాక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌కు రూ.2 లక్షలకు మోసం చేసింది. ఇటీవల లండన్‌కు చెందిన యువతి ఫేస్‌బుక్‌లో డాక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌కు పరిచయమైంది. తాను డాక్టర్‌గా కొనసాగుతున్నానని లండన్‌లోని కమిల్లా గంపి తన పేరుగా చెప్పుకొని నిత్యం చాటింగ్‌ చేసేది. ఇలా కొన్ని రోజులుగా సాగిన ఫేస్‌బుక్‌ స్నేహం మరింత దగ్గరైంది. ఈ క్రమంలో తాను త్వరలోనే భారత్‌కు వస్తున్నానని కమిల్లా తెలిపింది.
 
ఇలా ఏప్రిల్‌ 30న ఉదయం 11 గంటలకు ఉడిపి వైద్యుడికి ఫోన్‌ చేసి తనకు ఢిల్లీ ఎయిర్‌ పోర్టులో కస్టమ్స్‌ అధికారులు ఇబ్బంది కల్గిస్తున్నారని, తన వద్ద బ్రిటన్‌ ఫౌండ్స్‌ ఉన్నాయని, అయితే అత్యవసరంగా నూ. 2 లక్షలు చెల్లించాల్సి ఉందని నమ్మించింది. దీంతో డాక్టర్‌ ప్రవీణ్‌ ఆమె అందించిన ఖాతాలకు ఐసిఐసిఐ, సిండకేట్‌ బ్యాంకుల ద్వారా 1,95,700 రూపాయలు పంపారు. ఆ తర్వాత ఆమె ఫోన్‌ స్విచాఫ్‌ చేయడం, అందుబాటులోకి రాకపోవడంతో అనుమానం వచ్చింది. ఈ మేరకు ఉడిపి క్రైం పోలీసులకు బాధిత డాక్టర్‌ ప్రవీణ్‌ ఫిర్యాదు చేశారు. ఇటీవల కొన్ని రోజులుగా ఢిల్లీ ఎయిర్‌పోర్టులో చిక్కుకున్నామని మోసం చేసిన సంఘటనలు కొనసాగుతున్నా ప్రజలు మాత్రం నమ్మడం విడ్డూరంగా ఉంది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *