ఫోన్‌ చేసి 1.38 లక్షలు కాజేశారు!


  • సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో ఆస్పత్రి సూపరింటెండెంట్‌
రాజాం, ఏప్రిల్‌ 27: బ్యాంక్‌ నుంచి ఫోన్‌ చేస్తున్నామంటూ.. సైబర్‌ నేరగాళ్లు పన్నిన ఉచ్చులో శ్రీకాకుళం జిల్లా రాజాం ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మహంతి చంద్రశేఖర్‌ నాయుడు చిక్కుకున్నారు. తనతోపాటు తన భార్య ఖాతా నుంచి రూ. 1,38,500 పోగొట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 24న ఉదయం తొమ్మిది గంటలకు ఆస్పత్రికి వెళ్తున్న చంద్రశేఖర్‌కు ఓ ఫోన్‌కాల్‌ వచ్చింది. ఆ వ్యక్తి స్టేట్‌బ్యాంక్‌ మెయిన్‌ బ్రాంచ్‌ నుంచి ఫోన్‌ చేస్తున్నామని చెప్పడంతో డ్యూటీకి వెళ్లే హడావిడిలో ఉన్న చంద్రశేఖర్‌ నిజమేనని నమ్మి వారి ఖాతాలకు సంబంధించిన పూర్తి వివరాలు అందజేశారు. ఆపై తనఫోన్‌కు వచ్చిన ఓటీపీ నంబర్‌ను సైతం ఫోన్‌ చేసిన వ్యక్తికి తెలిపారు. అంతే సైబర్‌ నేరగాళ్లు 30 నిమిషాల వ్యవధిలో 4 లావాదేవీల ద్వారా తీసేశారు. నగదు విత్‌డ్రా అయిననట్టు మెసేజ్‌ రావడంతో డాక్టర్‌ హతాశుడయ్యారు. దీనిపై రాజాం సీఐ జీవీ రమణకు, స్టేట్‌బ్యాంక్‌ మేనేజర్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *