బంట్రోతుల కన్నా హీనంగా పోలీసులను వాడుతున్నారు


  • వర్మ వ్యవహారంపై జగన్‌ ట్వీట్‌
అమరావతి, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పోలీసులను బంట్రోతుల కన్నా హీనంగా వాడుతున్నారని వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ఆరోపించారు. ‘విజయవాడలో ప్రెస్‌మీట్‌ పెట్టలేని పరిస్థితుల్లో మన ప్రజాస్వామ్యం ఉంది. పోలీసుల్ని బంట్రోతుల కన్నా హీనంగా వాడుకునే పరిస్థితుల్లో మన ప్రజాస్వామ్యం ఉంది. ఇదా ప్రజాస్వామ్యం చంద్రబాబు గారూ! ఇంతకూ రామ్‌గోపాల్‌ వర్మ చేసిన తప్పేంటి’ అని ట్విటర్‌లో ప్రశ్నించారు.
 
సీఎస్‌, సీఈవో ఫోన్లు ట్యాప్‌ చేసే ఉంటారు: విజయసాయి
‘సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం, సీఈవో ద్వివేది ఫోన్లను ఈ పాటికి ట్యాప్‌ చేసే ఉంటారు. వారిద్దరి పేషీల్లో ఉన్న తమ అనుకూల సిబ్బంది ద్వారా మినిట్‌ టు మినిట్‌ సమాచారాన్ని సేకరిస్తూనే ఉండి ఉంటారు’ అపి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు. అయినా ఈ అభద్రత ఏమిటో అంతుబట్టడం లేదని పేర్కొన్నారు. అంత దోపిడీ చేశారా? తప్పించుకోలేని స్థాయిలో అక్రమాలకు పాల్పడ్డారా? తుఫాను వస్తే ప్రజలను సీఎస్‌ రక్షిస్తారా అని యనమల ప్రశ్నించడం చూస్తే జాలేస్తోంది. ముందస్తు జాగ్రత్తల నుంచి సహాయ కార్యక్రమాల వరకూ ఎప్పుడూ పర్యవేక్షించేది జిల్లా కలెక్టర్లే కదా! గతంలో మీ సీఎం విదేశాల్లో ఉంటే, సహాయ చర్యలు ఆగిపోయాయా? నిద్రలో కూడా వీళ్లకు సీఎస్‌ పీడకలగా వస్తున్నాడు’ అని మరో ట్వీట్‌ చేశారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *