బయాలజీతో భయం లేదు!


  • వ్యవహారిక భాషలో ‘జీవశాస్త్రం’.. మద్రాస్‌ ఐఐటీ విద్యార్థుల ప్రయోగం
  • తొలుత 7 భాషల్లో యూట్యూబ్‌ వీడియో
  • ఐజెమ్‌ బృందం సంచలనం
మామిడి టెంకను భూమిలో పాతితే పెరిగేది మామిడి చెట్టే! నిమ్మ, యాపిల్‌ చెట్లు రావు!! దీనికి కారణం.. జన్యుపరమైన లక్షణాలు. చెప్పడానికి, వినడానికి, అర్థం చేసుకోవడానికి ఈ ఉదాహరణ చాలా తేలికగా ఉంటుంది. ఇంతే తేలికగా జీవశాస్త్రం(బయాలజీ)ను అర్థం చేసుకోగలమా? అది సాధ్యమేనా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమే కాదు.. చక్కటి పరిష్కారం చూపించి అబ్బురపరుస్తున్నారు మద్రాస్‌ ఐఐటీ విద్యార్థులు. ‘ఐజెమ్‌’ పేరుతో వారి చేపట్టిన ప్రయోగం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది.
 
ఇంగ్లి్‌షకు చెక్‌!
‘ఏం చదువుతున్నావు?’ అని ఎవరైనా అడిగితే ‘బయాలజీ’ అని చెబితే ఎదుటవారికి అదేంటో తెలియకపోవచ్చు. దానినో బ్రహ్మ పదార్థంగా భావిస్తారు. పూర్తిగా ఇంగ్లి్‌షలో ఉండే ఈ పాఠ్యాంశాన్ని సామాన్యులకు అర్థమయ్యే రీతిలో మలిచారు. ‘ఇంట్రడక్షన్‌ ఆఫ్‌ సింథటిక్‌ బయాలజీ’ పేరుతో యూట్యూబ్‌ వీడియోను రూపొందించారు. మొదటి వీడియోను ఏడు భారతీయ భాషలైన హిందీ, తమిళం, మలయాళం, గుజరాతీ, తెలుగు, కన్నడ, మరాఠీలో తీసుకొచ్చారు. ‘జీవశాస్త్రం మొత్తం ఇంగ్లి్‌షలోనే అందుబాటులో ఉంది. దీనిని అర్థం చేసుకోవడానికి ఆంగ్లం అడ్డంకి కాకూడదని భావించాం’ అని ఈ బృందంలోని మౌసామీ షిండే తెలిపారు. ఇది సూపర్‌ సక్సెస్‌ కావడంతో ఈ వీడియోను 33 భాషల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందులో 20 భారతీయ భాషలతోపాటు 13 విదేశీ భాషలున్నాయి. చదువుకోని వారికి కూడా అర్థమయ్యే రీతిలో వీడియో ఉండటం విశేషం.
 
చిత్రాలతో చిత్రంగా..!
2018లో ఐజెమ్‌ బృందం ‘ది లాంగ్వేజ్‌ ప్రాజెక్టు’ పేరుతో దీనికి శ్రీకారం చుట్టింది. ఇందులోని వారంతా బయలాజికల్‌ ఇంజనీరింగ్‌, బయలాజికల్‌ సైన్సెస్‌ చదువుతున్నవారే. ‘అన్నింటిలోనూ జీవశాస్త్రం ఉంది. కాకపోతే దీనిని అర్థమయ్యే రీతిలో చెబితే, ఈ అంశంపై ఆసక్తి కలుగుతుంది. నలుగురికీ చెబుతారు’ అని ఐఐటీ మద్రా్‌సలో బయలాజికల్‌ ఇంజనీరింగ్‌ నాలుగో ఏడాది చదువుతున్న బీపీ కైలాశ్‌ తెలిపాడు. కేవలం చిత్రాలతో సరిపెట్టకుండా అవేంటో వాయి్‌సవోవర్‌లో వివరించడం ఈ వీడియోలోని ప్రత్యేకత. ఇందుకోసం ఎన్‌సీఈఆర్టీ పుస్తకాలు, ప్రొఫెసర్ల సాయం తీసుకున్నారు.
-చెన్నై

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *