బాంబు పేలుళ్ల నుంచి తృటిలో తప్పించుకున్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి


విశాఖపట్నం: ఈస్టర్ డే రోజున శ్రీలంక రాజధాని కొలంబో బాంబు పేలుళ్లు జరిగిన సంగతి తెలిసిందే. ఈ పేలుళ్ల థాటికి 295మందికి పైగా మృతి చెందగా.. అంతకు రెట్టింపు మందికి గాయాలయ్యాయి. ఇదిలా ఉంటే పలువురు భారతీయులు తృటిలో తప్పించుకుని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. ఇప్పటికే పలువురు అనంత వాసులు శ్రీలంకలో సురక్షితంగా బయటపడినట్లు వార్తలు వచ్చిన విషయం విదితమే.
 
కాగా.. ఈ పేలుళ్లు జరిగినప్పుడు అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుడివాడ అమర్‌నాథ్ శ్రీలంకలోనే ఉన్నారు. బాంబు పేలుళ్ల నుంచి అమర్‌నాథ్, ఆయన స్నేహితులు తృటిలో తప్పించుకున్నారు. ఎన్నికల అనంతరం స్నేహితులతో కలిసి అమర్ శ్రీలంకకు వెళ్లారు. అమరనాథ్ బసచేసిన కింగ్స్‌జ్యూరీ హోటల్‌కు అతి సమీపంలో బాంబులు పేలాయి. అప్రమత్తమైన అమర్, ఆయన స్నేహితులు తృటిలో తప్పించుకున్నారు. అనంతరం స్నేహితులతో కలిసి సురక్షితంగా అమర్.. విశాఖ చేరుకున్నారు. అమర్‌తో పాటు శ్రీలంకకు వెళ్లిన వారిలో వైసీపీ నేత శ్రీకాంత్ రాజు కూడా ఉన్నారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన అమర్.. దేవుడి ఆశీస్సులు, ప్రజల అభిమానమే తమను ఈ ఘటన నుంచి రక్షించాయన్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *