బాక్సర్ విజేందర్ సింగ్‌కు కాంగ్రెస్ సౌత్ ఢిల్లీ టిక్కెట్..?


న్యూఢిల్లీ: ప్రముఖ బాక్సర్ విజేందర్ సింగ్‌‌ను సౌత్ ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించే అవకాశాలున్నాయి. ఆప్‌తో పొత్తు లేకుండా ఒంటరిగానే బరిలోకి దిగేందుకు మొగ్గుచూపించిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఆరుగురు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.
 
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత షీలా దీక్షిత్‌ ఈశాన్య ఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. తక్కిన వారిలో జే పీ అగర్వాల్ (చాందినీ చౌక్), అరవిందర్ సింగ్ లవ్లీ (తూర్పు ఢిల్లీ), రాజేశ్ లిలోతియా (వాయవ్య ఢిల్లీ), మహాబల్ మిశ్రా (పశ్చిమ ఢిల్లీ) ఉన్నారు. అయితే, ఢిల్లీలో మొత్తం 7 లోక్‌సభ నియోజకవర్గాలు ఉండగా, దక్షిణ ఢిల్లీ నియోజకవర్గం మినహా తక్కిన అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో దక్షిణ ఢిల్లీ అభ్యర్థిగా బాక్సార్ విజేందర్ సింగ్‌ పేరును తాజా జాబితాలో ప్రకటించే అవకాశాలున్నట్టు పార్టీ వర్గాల సమాచారం.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *