బారామతీలో సుప్రియతో కొత్త అభ్యర్థి ఢీ


  • ఇంతవరకు బీజేపీ, శివసేన గెలవని స్థానం
బారామతీ మూడు దశాబ్దాలుగా పవార్‌ కుటుంబం ఏలుబడిలో ఉన్న ప్రాంతం. ఏ పార్టీలో ఉన్నా ‘పవార్‌’కే జై కొట్టారు బారామతీ ప్రజలు. పశ్చిమ మహారాష్ట్రలోని ఈ స్థానంలో బీజేపీ లేదా శివసేన ఎప్పుడూ గెలవలేదు. కానీ, ఈసారి భారీ మెజారిటీతో గెలవబోతున్నామని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా ప్రకటన ఆసక్తి రేకెత్తించింది. బారామతీ బరిలో ఎన్సీపీ అభ్యర్థిగా పవార్‌ తనయ సుప్రియా సులే హ్యాట్రిక్‌ కొట్టాలని చూస్తున్నారు. బీజేపీ మాత్రం రాజకీయాలకు కొత్త అయిన కాంచన్‌ కుల్‌ను పోటీకి దింపి సవాల్‌ విసిరింది. 2014లో సుప్రియకు ఆరెస్పీ వ్యవస్థాపకుడు మహదేవ్‌ జాన్‌కర్‌ గట్టి పోటీ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన ఫడణవిస్‌ కేబినెట్‌లో మంత్రిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కాంచన్‌ను బరిలోకి దింపడం విశేషం.
  • మొత్తం ఓటర్లు 18,13,543

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *