బాలికలదే పైచేయి


  • సీబీఎస్‌ఈ టెన్త్‌లో 92.45 % తో సత్తా చాటిన అమ్మాయిలు.. దేశవ్యాప్తంగా 91.10%  ఉత్తీర్ణత నమోదు
  • 13 మందికి 499 మార్కులు
  • 99.47 శాతంతో కేవీల హవా
  • ఇద్దరు హైదరాబాదీలకు ర్యాంక్‌-3
న్యూఢిల్లీ, మే 6: సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎ్‌సఈ) పదో తరగతి పరీక్ష ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. సోమవారం విడుదలైన ఈ ఫలితాల్లో దేశ వ్యాప్తంగా 91.10% ఉత్తీర్ణత నమోదైంది. ఇందులో బాలికలు 92.45%, బాలురు 90.14% మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ ఏడాది ఫిబ్రవరి 5 నుంచి ఏప్రిల్‌ 4 వరకు నిర్వహించిన పరీక్షలకు 19,298 పాఠశాలల నుంచి 17,61,076 మంది విద్యార్థులు హాజరు కాగా 16,04,428 మంది ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాది (86.70ు)తో పోలిస్తే ఈసారి 4.40ు అధికంగా ఉత్తీర్ణత నమోదైంది. కేంద్రీయ విద్యాలయాలు అత్యధికంగా 99.47% ఉత్తీర్ణత సాధించాయి. ఆ తరువాతి స్థానంలో నవోదయ విద్యాలయాలు (98.57%) నిలిచాయి. ప్రైవేటు పాఠశాలలు (94.15%) మూడో స్థానం పొందాయి. 13 మంది 499/500 మార్కులతో మొదటి ర్యాంకు పొందారు. 498 మార్కులతో రెండో ర్యాంకును 24 మంది, 497 మార్కులతో 58 మంది మూడో ర్యాంకులో నిలిచారు. మూడో ర్యాంకు సాధించిన వారిలో హైదరాబాద్‌కు చెందిన అంకిత్‌ సాహా, మద్దాల హర్షిణి ఉన్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *