బీజేపీకి వేద్దామనుకుంటే కాంగ్రెస్ బటన్ నొక్కించారు: వృద్ధ మహిళా ఓటరు


అమేఠీ: లోక్‌సభ ఎన్నికల ఐదవ దశ పోలింగ్ కొనసాగుతోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పోటీచేస్తున్న యూపీలోని అమేఠీ సీటును ఆ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ఇదే స్థానం నుంచి బీజేపీ తరపున స్మృతి ఇరానీ పోటీ చేస్తున్నారు. కాగా అమేఠీ పరిధిలోని ఒక పోలింగ్ బూత్‌లో బలవంతంగా ఓట్లు వేయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అమేఠీకి చెందిన ఒక వృద్ధ మహిళా ఓటరు బూత్‌లోని అధికారి తనచేత బలవంతంగా కాంగ్రెస్‌కు ఓటు వేయించారని తెలిపింది. తాను బీజేపీకి ఓటు వేయాలని అనుకున్నానని చెప్పింది. అయితే తన చేయిపట్టుకుని మరీ కాంగ్రెస్ బటన్ నొక్కించారని పేర్కొంది. కాగా రాహుల్ అమేఠీ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయడం ఇది నాల్గవసారి.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *