‘బీజేపీకి 22 స్థానాలు ఖాయం’


బెంగళూరు: లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో రెండో విడత పోలింగ్‌లోనూ బీజేపీ అనుకూల వాతావరణం ప్రస్ఫుటంగా కనిపించిందని మొత్తమ్మీద 22 స్థానాలను అవలీలగా కైవశం చేసుకుంటామనీ బీజేపీ ప్రకటించింది. ఆ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి అరవింద లింబావళి నగరంలో బుధవారం మీడియాతో మాట్లాడారు. రెండో విడత పోలింగ్‌ జరిగిన పలు నియోజకవర్గాలలో ఓటర్ల జాబితాలో అవకతవకలు కనిపించాయని పలు చోట్ల ఈవీఎంలు పని చేయలేదని ఆరోపించారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన కాంగ్రెస్‌, జేడీఎస్‌ నేతలపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. మే 23 తర్వాత రాష్ట్రంలో అనూహ్య రాజకీయ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *