బీజేపీకి 300 సీట్లు: జోస్యం చెప్పిన ప్రొఫెసర్‌పై వేటు


ఉజ్జయిని: మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో గల విక్రమ్ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న ప్రొఫెసర్ రాజేశ్వర్ శాస్త్రి ముసల్గావ్కర్ తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో బీజేపీకి లోక్‌సభ ఎన్నికల్లో 300 సీట్లు వస్తాయని జ్యోతిష్యం లెక్కల ప్రకారం తెలిపారు. దీంతో ఆయన సస్పెన్షన్ వేటుకు గురయ్యారు. విశ్వవిద్యాలయ నిబంధనలు ఉల్లంఘించి, సోషల్ మీడియాలో రాజకీయాలకు సంబంధించిన పోస్టులు పెట్టిన కారణంగా ఆయనను సస్పెండ్ చేశారు. విశ్వవిద్యాలయం అధికారులు తెలిపిన వివరాల ప్రకారం వర్శిటీలోని జ్యోతిష్య విభాగపు అధ్యక్షుడు ముసల్గావ్కర్ ఇటీవల తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో ‘బీజేపీ 300కు సమీపంలో, ఎన్డీఏ 300 దాటి’ అని రాశారు. ఇలా పేర్కొనడం ఎన్నికల నియయావళికి విరుద్దమని భావించిన వర్శిటీ ఉన్నతాధికారులు అతనిని సస్పెండ్ చేశారు. కాగా ముసల్గావ్కర్ ఈ పోస్టు చేసిన మర్నాడు క్షమాపణ కోరుతూ, తన పోస్టును తొలగించారు. కాగా దీనిపై స్పందించిన బీజేపీ నేతలు జ్యోతిష్యం చెప్పడమనేది ముసల్గావ్కర్ డ్యూటీ అని, అందుకే వెంటనే అతనిపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *