బీజేపీలోకి మాజీ కేంద్ర మంత్రి… సోనియా గాంధీపై తీవ్ర ఆరోపణలు…


తిరువనంతపురం : మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ మాజీ నేత ఎస్ కృష్ణ కుమార్ శనివారం భారతీయ జనతా పార్టీలో చేరారు. తాను సోనియా గాంధీ, రాహుల్ గాంధీల నాయకత్వానికి వ్యతిరేకమని చెప్పారు.
 
కాంగ్రెస్‌ను వదిలిపెట్టి, బీజేపీలో చేరడానికి కారణాలను కృష్ణ వివరించారు. మాజీ ప్రధాన మంత్రి పీ వీ నరసింహా రావును సోనియా గాంధీ తీవ్రంగా అవమానించారని ఆరోపించారు. పీ వీ అస్థికలను కనీసం కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ఉంచడానికి కూడా కాంగ్రెస్ నాయకత్వం అంగీకరించలేదన్నారు. భారతీయ వారసత్వం, సంస్కృతి గురించి సోనియా గాంధీకి ఏమీ తెలియదని ఆరోపించారు.
 
తన శేష జీవితాన్ని నరేంద్ర మోదీ సైనికునిగా గడుపుతానని కృష్ణ చెప్పారు. రాబోయే పదేళ్ళకు నరేంద్ర మోదీకి అనుకూలంగా ప్రజా తీర్పు రావాలన్నారు.
 
రాజీవ్ గాంధీ, నరసింహారావు ప్రభుత్వాల్లో కృష్ణ కుమార్ కేంద్ర మంత్రిగా పని చేశారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *