బీజేపీలోకి సన్నీ దేవల్‌


  • గురుదా్‌సపూర్‌ నుంచి పోటీ!
న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): బాలీవుడ్‌ నటుడు సన్నీ దేవల్‌ మంగళవారం బీజేపీలో చేరారు. కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్‌, పీయూష్‌ గోయల్‌ సమక్షంలో బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించారు. ఆయన పంజాబ్‌లోని గురుదా్‌సపూర్‌ నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా సన్నీ దేవల్‌ మాట్లాడుతూ ‘‘మా నాన్న ధర్మేంద్ర వాజ్‌పేయితో కలిసి పనిచేశారు. ఆయనలాగే నేను కూడా బీజేపీ, మోదీ కోసం పనిచేస్తాను. మోదీ మరో ఐదేళ్లు ప్రధానిగా ఉండాలి’’ అని అన్నారు. పంజాబ్‌లో శిరోమణి అకాలీ దళ్‌తో పొత్తు పెట్టుకున్న బీజేపీ అమృత్‌సర్‌, గురుదా్‌సపూర్‌, హోషియార్‌పూర్‌ స్థానాల్లో పోటీ చేస్తోంది. పంజాబ్‌లో మే 19న ఎన్నికలు జరగనున్నాయి.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *