బీజేపీలో ఏడుగురు మాజీ సైనికాధికారులు


న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల మధ్యలోనూ ప్రధాన పార్టీల్లో చేరికలు కొనసాగుతున్నారు. ఏడుగురు మాజీ సైనిక అధికారులు శనివారంనాడు బీజేపీలో చేరారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సమక్షంలో వీరు పార్టీలో చేరారు.
 
బీజేపీ ప్రధాన కార్యాలయంలో వీరికి నిర్మలా సీతారామన్ సాదర స్వాగతం పలికారు. లెఫ్టినెంట్ జనరల్ జేబీఎస్ యాదవ్, లెఫ్టినెంట్ జనరల్ ఆర్.ఎన్.సింగ్, లెఫ్టినెంట్ జనరల్ ఎస్‌కే పట్యాల్, లెఫ్టినెంట్ జనరల్ సునిత్ కుమార్, లెఫ్టినెంట్ జనరల్ నితిన్ కోహ్లి, కల్నల్ ఆర్.కె.త్రిపాఠి, వింగ్ కమాండర్ నవనీత్ మగాన్‌‌లు బీజేపీలో చేరిన వారిలో ఉన్నారు. భారత సాయుధ దళాల్లో వీరు చేసిన సేవలను ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ కొనియాడారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *