బీజేపీ అభ్యర్థిపై లైంగిక ఆరోపణల కొట్టివేత


బెంగళూరు: బెంగళూరు దక్షిణ బీజేపీ అభ్యర్థి తేజస్వి సూర్యపై దాఖలు చేసిన లైంగిక ఆరోపణల కేసును మహిళా కమిషన్‌ కొట్టివేసింది. తేజస్వి సూర్యపై ఎటువంటి ఆరోపణలు చేయలేదని… అవాస్తవాలని… గతంలో ఆరోపణలు చేసినట్లుగా పేర్కొన్న ఆమె నగర పోలీస్‌ కమిషనర్‌కు లేఖ పంపారు. ఈ మేరకు మహిళా కమిషన్‌ కేసును కొనసాగించలేమంటూ కొట్టివేసింది. పోలీస్‌ కమిషనర్‌కు లేఖ పంపిన మహిళను విచారించిన కమిషన్‌ అందుకు సంబంధించిన వివరాలను సేకరించారు. తేజస్వి సూర్య నాకు మంచి మిత్రుడని ట్విట్టర్‌లో ఆరోపణలు చేసినట్లు వస్తున్నవి అవాస్తవాలని వివరించారు. తేజస్వి ఎదుగుదలను జీర్ణించుకోలేనివారు ఇటువంటి వదంతులను సృష్టించారన్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *