బీజేపీ నుంచి ఈశాన్య రాష్ట్రాలను కాపాడతా : రాహుల్ గాంధీ


న్యూఢిల్లీ : ఈశాన్య రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలను కాపాడటానికి కట్టుబడి ఉన్నట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చెప్పారు. పౌరసత్వ సవరణ బిల్లును అడ్డుకుంటామని తెలిపారు. ఆదివారం ఆయన రాసిన ఫేస్‌బుక్‌ పోస్ట్‌లో ఈ హామీలు ఇచ్చారు.
 
ఈశాన్య రాష్ట్రాలు, అక్కడి ప్రజల ప్రయోజనాలను పరిరక్షించడానికి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కట్టుబడి ఉందని రాహుల్ పేర్కొన్నారు. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లును వెంటనే తిప్పి పంపుతామని హామీ ఇచ్చారు. అర్హులైన భారత పౌరులు జాతీయ పౌరుల నమోదు జాబితా (ఎన్ఆర్‌సీ)లో నమోదయ్యే అవకాశాన్నికోల్పోకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
 
ఇదిలావుండగా, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఈ నెల 11న డార్జిలింగ్‌లో మాట్లాడుతూ దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ఎన్ఆర్‌సీని అమలు చేస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. చొరబాటుదారులందరినీ దేశం నుంచి పంపిస్తామని తెలిపారు. బౌద్ధులు, హిందువులు, సిక్కులకు మాత్రం మినహాయింపునిస్తామన్నారు. తాము దేశ భద్రతకే పెద్ద పీట వేస్తామన్నారు. హిందూ, బౌద్ధ శరణార్థులకు దేశ పౌరసత్వం కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *