బీజేపీ ప్రచారంలో రెజ్లర్ గ్రేట్ ఖలి.. ఈసీకి టీఎంసీ ఫిర్యాదు


కోల్‌కతా: భారతీయ జనతా పార్టీ తరఫున రెజ్లర్ ది గ్రేట్ ఖలి ప్రచారం చేయడంపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. గ్రేట్ ఖలి పౌరసత్వ హోదాపై అభ్యంతరం తెలుపుతూ ఈసీకి ఆదివారంనాడు లేఖ రాసింది. ఖలికి అమెరికా పౌరసత్వం ఉందని, ఎన్నికల ప్రచారంలో భారతీయ ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఒక విదేశీయుడిని అనుమతించరాదని ఈసీని ఆ లేఖలో కోరింది.
 
బీజేపీ జాదవ్‌పూర్ ఎంపీ అభ్యర్థి అనుపమ్ హజ్రా తరఫన ఖలి ప్రచారం చేశారు. ఓపెన్ టాప్ జీపులో ఖలి ప్రచారం చేస్తూ బీజేపీ అభ్యర్థికి ఓటేయాలంటూ ప్రజలను కోరారు. బెంగాలీ నటి, టీఎంసీ అభ్యర్థఇ మిమి చక్రవర్తిపై హజ్రా పోటీ చేస్తున్నారు. కాగా, పశ్చిమబెంగాల్‌లో ఇప్పటికీ మూడు విడతలు ఎన్నికలు జరుగగా, తక్కిన నాలుగు విడతల పోలింగ్ ఈనెల 29, మే 6, 12, 19లలో జరుగన్నాయి.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *