బీజేపీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు: శివసేన


ముంబై: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 2014 తరహాలా సొంతంగా సంపూర్ణ మెజారిటీ సాధించే అవకాశాలున్నాయా? బీజేపీ మిత్రపక్షమైన శివసేన మాత్రం ఇందుకు భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. తదుపరి ప్రభుత్వాన్ని బీజేపీ ఈసారి సొంతంగా ఏర్పాటు చేయలేకపోవచ్చని పేర్కొంది. గత ఎన్నికల్లో 280 సీట్ల మార్క్‌ను చేరుకున్న బీజేపీ ఈసారి మాత్రం ఆ సంఖ్యను చేరుకోవడం ‘ఒకింత కష్టమే’నని శివసేన సీనియర్ నేత సంజయ్‌రౌత్ తెలిపారు. మంగళవారంనాడు ఓ టీవీ ఛానెల్‌తో ఆయన మాట్లాడుతూ, తదుపరి ప్రభుత్వాన్ని ఎన్డీయే ఏర్పాటు చేస్తుందని రామ్ మాధవ్ చెప్పడం సరైనదేనని అన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని, 280 నుంచి 282 సంఖ్యను సొంతంగా సాధించడం మాత్రం ఒకింత కష్టమేనని అన్నారు. అయితే ఎన్డీయే పరివార్ (కుటుంబం) మెజారిటీ మార్క్‌ను దాటుతుందని చెప్పారు.
 
ఆయనే పీఎం అయితే సంతోషమే..
నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని అయితే శివసేనకు సంతోషమేనని రౌత్ తెలిపారు. ఎన్డీయేలో శివసేన భాగస్వామిగా ఉంటుందని, మోదీ రెండోసారి ప్రధాని అయితే తమకు హ్యాపీనేనని చెప్పారు. కాగా, రామ్ మాధవ్ గత వారం జరిగిన ఓ ఇంటర్వ్యూలో, బీజేపీ సొంతంగా 271 సీట్లు సొంతంగా సాధిస్తే తమకు సంతోషమేనని, ఎన్డీయేతో కలిసి కంఫర్టబుల్ మెజారిటీ సాధించగలుగుతామని చెప్పారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *