బీసీలకు వ్యతిరేకంగా పనిచేసింది మోదీనే: గంగాధర్


విజయవాడ: ఎలాగైనా గెలవాలని మోదీ తప్పుడు విధానాలు అవలంబిస్తున్నారని కాంగ్రెస్‌ నేత గంగాధర్‌ ఆరోపించారు. ప్రజల మధ్య చీలికలు తెచ్చి కుల, మతాల పేరుతో విద్వేషాలు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. బీసీని కాబట్టే తనపై దాడి చేస్తున్నారని మోదీ అనడం సరికాదన్నారు. గతంలో బీసీలకు వ్యతిరేకంగా పనిచేసింది మోదీనేనన్నారు. బీసీలకు మేలు చేసే చట్టాలు చేసింది కాంగ్రెస్‌ పార్టీనేనని గుర్తుచేశారు. ఈసీ, ఐటీ, ఈడీ వంటి సంస్థలను గుప్పెట్లో పెట్టుకుని ఇతర పార్టీలపై మోదీ దాడులు చేయిస్తున్నారని విమర్శించారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *